Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్రివిక్రమ్ మూవీలో అల్లు అర్జున్ తల్లి పాత్రలో 'టబు'?

  • త్రివిక్రమ్ తదుపరి సినిమాకి సన్నాహాలు
  • యాక్షన్ కీ .. ఎమోషన్ కి పెద్దపీట
  •  వచ్చేనెలలో రెగ్యులర్ షూటింగు
త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమా చేయనున్నాడు. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన కామెడీ ఎంటర్టైనర్ గా ఇది రూపొందనుంది. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి అవసరమైన సన్నాహాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ మొదటివారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టేసి, ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేస్తారట.

ఇప్పటికే ముఖ్యమైన పాత్రల కోసం తమిళనటుడు సత్యరాజ్ .. మలయాళ నటుడు జయరామ్ .. రాజేంద్ర ప్రసాద్ .. రావు రమేష్ .. సీనియర్ నరేశ్ లను తీసుకున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ తల్లి పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందట. అందువలన ఈ పాత్రకి సీనియర్ హీరోయిన్ ను తీసుకుందామనే ఉద్దేశంతో, 'టబు'ను సంప్రదిస్తున్నారట. ఆమె ఎంపిక దాదాపు ఖరారు కావొచ్చని అంటున్నారు. ఇంతకుముందు నదియా .. ఖుష్బూలాంటి వారిని తీసుకొచ్చిన త్రివిక్రమ్, ఇప్పుడు 'టబు'ను రంగంలోకి దింపుతున్నాడన్న మాట.
allu arjun
tabu

More Telugu News